Samantha: ఆంచనాలు పెంచే దిశగా 'శాకుంతలం' .. ట్రైలర్ రెడీ!

Shaakuntalam  Movie Update

  • శకుంతలగా అలరించనున్న సమంత 
  • దృశ్యకావ్యంగా మలచిన గుణశేఖర్
  • అదనపు బలంగా నిలవనున్న మణిశర్మ సంగీతం 
  • ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల

పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి 'శాకుంతలం' సినిమా రెడీ అవుతోంది. 'శకుంతల'గా సమంతను చూడటానికి ఆమె అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత గుణశేఖర్ నుంచి వస్తుండటంతో, ఆయన మార్క్ సినిమాలను ఇష్టపడేవారు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 

మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి వరుసగా పాటలను వదులుతూ వచ్చారు. రేపు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఈ ట్రైలర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలను పెంచనున్నారు. ఇప్పటికే ఇది ఒక దృశ్య కావ్యమనీ .. విజువల్ వండర్ అనే విషయంపై అందరిలోను ఒక స్పష్టత వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

More Telugu News