Nani: 'దసరా'లో ఏ సీన్ నూ ఎంజాయ్ చేస్తూ చేయలేదు: హీరో నాని

Nani Interview

  • 'దసరా' సక్సెస్ సంబరాల్లో టీమ్
  • ఈ సినిమా హిట్ సంతోషాన్ని ఇచ్చిందన్న నాని 
  • నటుడిగా ఇంకా సంతృప్తి కలగలేదని వ్యాఖ్య 
  • కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని వెల్లడి   

నాని హీరోగా చేసిన 'దసరా' సినిమా క్రితం నెల 30వ తేదీన విడుదలైంది. ఈ సినిమా టీమ్ ఎప్పటికప్పుడు బజ్ పెంచుకుంటూ రావడంలో సక్సెస్ అయింది. రిలీజ్ కి ముందురోజు నాటికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవడంలో దర్శకుడు శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు. 

తాజాగా ఈ సినిమాను గురించి నాని మాట్లాడుతూ .. "ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నా ఫోన్ మ్రోగుతూనే ఉంది. చూసిన వాళ్లంతా అభినందిస్తూనే ఉన్నారు. ఒక నటుడికి ఇంతకంటే సంతోషం ఏముంటుంది? అయితే ఈ సినిమాతో నేను సంతృప్తి చెందడం లేదు. ఎందుకంటే సంతృప్తి చెందితే సాధన ఆగిపోతుంది" అని అన్నాడు.

"ఈ సినిమా విషయంలో ఎవరూ కూడా ఏ సీన్ ను ఎంజాయ్ చేస్తూ చేయలేదు. ప్రతి సీన్ పెర్ఫెక్ట్  గా రావడం కోసం కష్టపడేవాళ్లం. ఎండలో .. దుమ్ములో నానా ఇబ్బందులు పడ్డాము. అలా పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్నే ఈ రోజున మేం చూస్తున్నది. దర్శకుడు శ్రీకాంత్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని అనుకున్నాను .. అదే జరిగింది" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News