Rajanikanth: 'దర్బార్' ఫ్లాప్ కి రీజన్ చెప్పిన మురుగదాస్!

Murugadoss Interview

  • 2020లో వచ్చిన రజనీ 'దర్బార్'
  • మురుగదాస్ నుంచి వచ్చిన భారీ సినిమా ఇది 
  • ఆయన కెరియర్లోని ఫ్లాపుల జాబితాలో చేరిన మూవీ  
  • హడావిడే కొంపముంచిందని వెల్లడి

కోలీవుడ్ డైరెక్టర్ గా మురుగదాస్ కి మంచి క్రేజ్ ఉంది. కోలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్ వెళ్లి అక్కడి స్టార్స్ కి కూడా భారీ విజయాలను అందించిన ఘనత ఆయన సొంతం. తెలుగులో ఆయన నేరుగా చేసిన 'స్టాలిన్' చిరంజీవి కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

మురుగదాస్ సినిమాలకి సంబధించిన రీమేక్ హక్కుల కోసం ఇతర భాషల్లోని బడా నిర్మాణ సంస్థలు పోటీపడుతుంటాయి. అంత టాలెంట్ ఆయన సొంతం. అలాంటి మురుగదాస్ నుంచి 'దర్బార్' తరువాత ఇంతవరకూ సినిమా రాలేదు. 2020లో రజనీతో ఆయన చేసిన 'దర్బార్' పరాజయం పాలైంది.

తాజా ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ .. 'దర్బార్' సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి. ఆ అంచనాలను అందుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేయాలని భావించాను. కానీ ఈ సినిమా తరువాత రజనీ సార్ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను హడావిడిగా పూర్తిచేయవలసి వచ్చింది. అదే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమైంది'' అని చెప్పుకొచ్చారు. 

More Telugu News