Sri Lakshmi: నాకు ఇచ్చిన వాటిలో చెల్లని చెక్కులు ఎన్నో!: నటి శ్రీలక్ష్మి

Sri Lakshmi Interview

  • హాస్యనటిగా శ్రీలక్ష్మి స్థానం ప్రత్యేకం 
  • తన అభిమాన నటి సావిత్రి అని వెల్లడి 
  • రాజబాబుతో నటించడం అదృష్టమని వ్యాఖ్య 
  • చాలామంది డబ్బులు ఎగ్గొట్టారని వివరణ


తెలుగు తెరపై హాస్యనటిగా శ్రీలక్ష్మి తనదైన ముద్రవేశారు. నవ్వించడమే ప్రధానమైన విలక్షణమైన పాత్రలను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ .. "సావిత్రి గారు .. జయసుధ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. సావిత్రిగారితో కలిసి నటించలేకపోయానే అనే బాధ ఉంది. జయసుధగారితో కలిసి నటించిన ఆనందం ఉంది" అన్నారు. 

"రాజబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి ఒక సినిమా చేశాను .. అది నా అదృష్టంగా భావిస్తుంటాను. ఇక బ్రహ్మానందం గారు .. ఎమ్మెస్ నారాయణ గారి కామెడీ కూడా బాగుంటుంది. నన్ను అవమానపరిచినవారు కూడా లేకపోలేదు. అయితే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాను" అని చెప్పారు. 

"ఇక అప్పట్లో ఏ పాత్రకి ఎంత అడగాలనేది కూడా నాకు తెలియదు. డబ్బు ఎగ్గొట్టినవారు చాలామంది ఉన్నారు. ఇక నా దగ్గరున్న చెల్లని చెక్కులు ఎన్నో. అప్పట్లో నాకు ఇచ్చిందే తక్కువ .. దాని కోసం నేను ఎంతమందిపై కేసులు పెట్టను. అందుకే ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటూ వెళ్లాను" అని చెప్పుకొచ్చారు. 

Sri Lakshmi
Savitri
Jayasudha
Rajababu
Tollywood
  • Loading...

More Telugu News