Nani: 'దసరా' సక్సెస్ సెలబ్రేషన్స్ కి ముహూర్తం ఖాయం!

Dasara Movie Success Celebrations

  • ఈ నెల 30న విడుదలైన 'దసరా'
  • 100 కోట్ల దిశగా వెళుతున్న సినిమా 
  • ఈ నెల 5వ తేదీన సక్సెస్ సెలబ్రేషన్స్ 
  • కరీంనగర్ వేదికగా జరగనున్న సందడి


ఈ మధ్య కాలంలో మాస్ కంటెంట్ తో థియేటర్స్ కి వచ్చిన సినిమాలలో 'దసరా' ఒకటి. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా, క్రితం నెల 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదల రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్ల విషయంలో అదే జోరును కొనసాగిస్తూ 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. 

ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించాలని ఈ సినిమా టీమ్ నిర్ణయించుకుంది. ఈ నెల 5వ తేదీన సక్సెస్ సెలబ్రేషన్స్ ను 'కరీంనగర్' లో నిర్వహించనుంది. అక్కడి ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఇందుకు వేదికగా మారనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

'దసరా' సినిమాలో కథ మొదలైన దగ్గర నుంచి నాని - కీర్తి సురేశ్ ఇద్దరూ కూడా డీ గ్లామర్ రోల్స్ లో కనిపిస్తారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా ఉండదు. కానీ ఆ లోటు ఎక్కడా తెలియదు .. కథ ఎంత మాత్రం బోర్ కొట్టదు. నాని - కీర్తి సురేశ్ కలిసి హిట్ కొట్టిన రెండో సినిమా ఇది.

More Telugu News