Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Big relief to Teenmar Mallanna in TS High Court
  • మల్లన్నకు వ్యతిరేకంగా పీటీ వారెంట్లు జారీ చేయవద్దన్న హైకోర్టు
  • మల్లన్నపై ఉన్న కేసులు, పీటీ వారెంట్ల వివరాలను ఇవ్వాలని ఆదేశం
  • తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా
జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్నకు వ్యతిరేకంగా ఎలాంటి ఖైదీ అప్పగింత (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ - పీటీ) వారెంట్లు జారీ చేయకూడదని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మల్లన్నపై వివిధ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జారీ చేస్తూ మల్లన్నను జైలు నుంచి బయటకు రానీయకుండా పోలీసులు చేస్తున్నారని ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఒకే రకమైన ఫిర్యాదులపై అనేక కేసులను నమోదు చేయడం ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులను హరించడం అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మల్లన్నకు వ్యతిరేకంగా పీటీ వారెంట్లు జారీ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. మల్లన్నపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేశారు? తదితర వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
Teenmar Mallanna
High Court

More Telugu News