Anand Devarakonda: 'బేబి' నుంచి వీడియో సాంగ్ రిలీజ్!

Baby movie song relesed

  • వైష్ణవి చైతన్య ప్రధానమైన పాత్రగా 'బేబి'
  • ఆమె జోడీగా కనిపించనున్న ఆనంద్ దేవరకొండ
  • ముఖ్యమైన పాత్రలో నాగబాబు  
  • సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గనిన్


ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య జంటగా 'బేబి' సినిమా రూపొందింది. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఎస్ కె ఎన్ నిర్మించిన ఈ సినిమాకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'దేవరాజ' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
 
పల్లెటూరి యువతిలా కనిపించే హీరోయిన్, సిటీకి వచ్చి మోడ్రన్ గా మారడమనేది ఈ పాటలో కనిపించే ప్రధానమైన అంశం. విజయ్ బుల్గనిన్ ఈ పాటను స్వరపరచగా, కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. ఆర్య ధ్యాయల్ ఈ పాటను ఆలపించారు. 

నాగబాబు .. విరాజ్ అశ్విన్ .. కుసుమ .. సాత్విక .. లిరిశ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ దేవరకొండ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి. 

More Telugu News