Dharmana Prasada Rao: చంద్రబాబుకు మహిళలు ఓటేస్తే వాళ్ల చెయ్యి వాళ్లే నరుక్కున్నట్టు: ధర్మాన

Dharmana comments in Asara meeting

  • శ్రీకాకుళం జిల్లాలో ఆసరా నిధుల పంపిణీ
  • హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు
  • సభ మధ్యలోనే వెళ్లిపోయేందుకు లేచిన మహిళలు
  • వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేసిన ధర్మాన

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు అనే వాళ్లు ఎవరూ చంద్రబాబుకు ఓటు వేయరని అన్నారు. ఒకవేళ చంద్రబాబుకు మహిళలు ఓటేస్తే వాళ్ల చెయ్యి వాళ్లే నరుక్కున్నట్టు లెక్క అని వ్యాఖ్యానించారు. ఎవరికి అధికారం ఇవ్వాలన్నా ప్రజలకు సాధ్యమని, ఆ విధంగా అధికారం ఇవ్వడం వల్లే ఇవాళ మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరుగుతోందని వివరించారు. 

"ఇదే కాదు మిగతా పథకాలన్నీ కూడా అధికారంలో భాగమే. సంవత్సరం తర్వాత ఇవన్నీ ఆగిపోతాయి. వచ్చే మే తర్వాత ఓటేయడం మానేశారనుకోండి... ఇది కూడా పోతుంది" అని తెలిపారు. అయితే, మంత్రి ధర్మాన ప్రసంగిస్తుండగానే మహిళలు సభ నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. దాంతో ఆయన స్పందిస్తూ... "ఏయ్ తల్లీ... అప్పుడే వెళ్లిపోతున్నారేంటి? మీటింగ్ అయిపోవచ్చింది కదా. ఒరేయ్ ఆటోలు తీయొద్దు... స్టార్ట్ చేయకండి. ఐదు నిమిషాల్లో సభ అయిపోతుంది" అంటూ వ్యాఖ్యానించారు.

Dharmana Prasada Rao
YSRCP
Women
TDP
Chandrababu
Srikakulam District
  • Loading...

More Telugu News