Pawan Kalyan: ఢిల్లీలో పవన్, నాదెండ్ల... ఏపీ బీజేపీ ఇన్చార్జితో భేటీ

Pawan and Nadendla met AP BJP Incharge Muralidharan

  • ఏపీలో మొదలైన ఎన్నికల సన్నాహాలు
  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్
  • రోడ్ మ్యాప్ కోసం బీజేపీ హైకమాండ్ తో చర్చించే అవకాశం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏపీలో క్రమంగా ఎన్నికల వాతావరణం నెలకొంటున్న పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో కలిసి ముందుకు నడవాలంటే రోడ్ మ్యాప్ అవసరమంటున్న పవన్... ఢిల్లీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తే జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో, పవన్ నేడు ఢిల్లీలో ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణపైనా చర్చిస్తున్నట్టు సమాచారం.

Pawan Kalyan
Nadendla Manohar
Muralidharan
Janasena
BJP
New Delhi
Andhra Pradesh
  • Loading...

More Telugu News