Sai Pallavi: నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: సాయిపల్లవి

Sai Pallavi Interview

  • యూత్ లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ 
  • సహజమైన నటనకు ఆమె కేరాఫ్ అడ్రెస్
  • ఆమె సినిమాల పట్ల ఆసక్తిని చూపించే ఫ్యాన్స్ 
  • తన డాన్స్ తన ఫిట్ నెస్ కి కారణమన్న సాయిపల్లవి


సాయిపల్లవికి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. మిగతా భాషల్లో కంటే తెలుగులో సాయిపల్లవికి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగులో సాయిపల్లవి ఒక సినిమా చేసిందంటే, సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతుంటాయి. ఆ సినిమాలో వైవిధ్యభరితమైన కంటెంట్ ఉండే ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో పెరుగుతూ వెళుతుంది.

సాయిపల్లవి సహజమైన నటన ఒక ఎత్తయితే ఆమె డాన్స్ మరో ఎత్తు. డాన్స్ పరంగా ఆమెకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చేయడానికి సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ .. "మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందువలన నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను" అని అన్నారు.

"ఇక నా ఫిట్ నెస్ గురించే అంతా అడుగుతుంటారు. ఫిట్ గా కనిపించడానికి ప్రత్యేకంగా నేను ఎలాంటి కసరత్తులు చేయను. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను.  అదే నా ఫిట్ నెస్ కి కారణం. నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ నాకు ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు" అంటూ చెప్పుకొచ్చారు.

Sai Pallavi
Actress
Tollywood
  • Loading...

More Telugu News