Global leader: గ్లోబల్ పాపులర్ లీడర్ గా మరోమారు మోదీ

PM Modi Tops List Of Most Popular Global Leader With 76 percentage Rating

  • 76 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
  • మొత్తంగా 22 మంది లీడర్లతో ‘మార్నింగ్ కన్సల్ట్’ జాబితా
  • ఆరో స్థానంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ లీడర్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు నిలిచారు. ప్రపంచ దేశాల లీడర్లు, వారు తీసుకునే నిర్ణయాలపై సర్వే నిర్వహించి మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 76 శాతం రేటింగ్ తో మోదీ టాప్ లో నిలిచినట్లు వెల్లడించింది. గ్లోబల్ లీడర్ లిస్టులో మోదీ గతంలోనూ టాప్ ప్లేస్ లో నిలిచారు. తాజా జాబితాను కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు గ్లోబల్ లీడర్ గా, అత్యంత నమ్మకస్తుడైన నేతగా నిలిచారంటూ గోయెల్ ట్వీట్ చేశారు.

గ్లోబల్ లీడర్ల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ఈ జాబితాలో పన్నెండో స్థానంలో నిలిచారు. 22 మంది గ్లోబల్ లీడర్ల పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చివరి స్థానంలో ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాతి స్థానంలో వరుసగా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ (61శాతం), ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ (55 శాతం), ఇటలీ ప్రధాని మెలొని (49 శాతం), బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా (49 శాతం), అమెరికా అధ్యక్షుడు బైడెన్ (41 శాతం), కెనడా ప్రధాని ట్రూడో (39 శాతం), స్పెయిన్ ప్రధాని షాంచెజ్ (38 శాతం), జర్మనీ చాన్సలర్ షోల్జ్ (35 శాతం), బ్రిటన్ ప్రధాని సునాక్‌ (34 శాతం) తదితరులు ఉన్నారు.

More Telugu News