Nani: నాలుగు రోజుల్లో 'దసరా' రాబట్టిన రికార్డుస్థాయి వసూళ్లు ఇవే!

Dasara Movie Update

  • ఐదు భాషల్లో విడుదలైన 'దసరా' 
  • తొలి రోజునే లభించిన హిట్ టాక్ 
  • నాలుగు రోజుల్లో 87 కోట్లకి పైగా గ్రాస్ 
  • ఈ రోజునో .. రేపో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్  


నాని హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో 'దసరా' సినిమా రూపొందింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో భారీస్థాయిలో విడుదలైంది. ఈ సినిమాలో నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించింది. 
 
తెలుగులో తొలి రోజునే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 38 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, రెండు రోజుల్లో 53 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. నిన్నటితో ఈ సినిమా నాలుగు రోజులను పూర్తిచేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో 87 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించింది. 

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో .. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నాని ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

More Telugu News