Rashmika Mandanna: లేడీ ఓరియెంటెడ్ సినిమాలో రష్మిక.. పోస్టర్ రిలీజ్

rashmika mandanna lady oriented movie titled as rainbow

  • ‘పుష్ప’ సినిమాతో బిజీగా మారిపోయిన రష్మిక
  • తొలిసారి కథానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రం ఎంపిక చేసుకున్న నేషనల్ క్రష్
  • తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ‘రెయిన్ బో’ 

కన్నడతో మొదలై.. తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీల్లో హవా కొనసాగిస్తోంది రష్మిక మందన్న. ‘చలో’ సినిమాతో తెలుగుతో హిట్ కొట్టి.. ‘పుష్ప’తో నేషనల్ క్రష్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ చాయిస్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తొలిసారి కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాను ఎంపిక చేసుకుంది.

ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను నిర్మాణ సంస్థ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ ప్రకటించింది. కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘రెయిన్ బో’ అనే పేరు ఖరారు చేసినట్లు ఈ రోజు ఉదయం వెల్లడించింది.

తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ బాబు నిర్మిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరణ్ స్వరాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ప్రస్తుతం రష్మిక.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌ అంచనాలున్నాయి. పుష్ప సీక్వెల్‌లోనూ కొనసాగుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్‌-వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

More Telugu News