Devi Sri Prasad: మరదలిని పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీప్రసాద్?

Devi Sri Prasad marriage

  • దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్న డీఎస్పీ
  • ఇద్దరి మధ్య 17 ఏళ్ల గ్యాప్ ఉందని సమాచారం

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనేదే ఆ వార్త. పెళ్లికూతురు ఆయనకు బంధువేనట. వరుసకు ఆమె మరదలు అవుతుందని చెపుతున్నారు. 

40 ఏళ్ల వయసు దాటిన దేవిశ్రీప్రసాద్ కు, కాబోయే పెళ్లికూతురుకు దాదాపు 17 ఏళ్ల గ్యాప్ ఉందని సమాచారం. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరగనుందనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

Devi Sri Prasad
Tollywood
Marriage
  • Loading...

More Telugu News