Rahul Gandhi: రాహుల్ నివాసానికి చేరుకున్న ప్రియాంక.. కాసేపట్లో సూరత్ కు బయల్దేరనున్న రాహుల్

Priyanka Gandhi reaches Rahul Gandhi residence

  • రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
  • తీర్పుపై అప్పీల్ చేసేందుకు సూరత్ కు వెళ్తున్న రాహుల్
  • రాహుల్ తో పాటు ప్రియాంక కూడా వెళ్లే అవకాశం

మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై లోక్ సభ ఎంపీగా అనర్హత వేటు పడింది. మరోవైపు ఈ తీర్పుపై 30 రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు కోర్టు కాలపరిమితిని విధించింది. దీంతో ఈరోజు అప్పీల్ చేయడానికి సూరత్ కు రాహుల్ గాంధీ వెళ్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన సూరత్ కు బయల్దేరుతారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం రాహుల్ నివాసానికి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ చేరుకున్నారు. రాహుల్ తో పాటు ఆమె కూడా సూరత్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ... భయపడే ప్రసక్తే లేదని రాహుల్ తమతో చెప్పారని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ముందు తలవంచే ప్రసక్తే లేదని తెలిపారని చెప్పారు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటారని అన్నారు.

Rahul Gandhi
Priyanka Gandhi
Congress
Surat Court
Defamation Suit

More Telugu News