Nara Lokesh: చెప్పేవి నీతులు... దోచేవి గుట్టలు: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేశ్ విమర్శనాస్త్రాలు

Lokesh targets MLA Kethireddy

  • శ్రీ సత్యసాయి జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • ధర్మవరం నియోజకవర్గంలోకి యువగళం
  • వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేసిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర నేడు ధర్మవరం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ క్రమంలో, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

చెప్పేవి నీతులు... దోచేవి గుట్టలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహిస్తారని, నిజాయతీగా ఉండాలంటూ ఉద్యోగులకు నీతులు చెబుతుంటారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇలా అందరికీ నీతిని బోధించే ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం గుట్టలు ఆక్రమించుకుంటాడని లోకేశ్ ఆరోపించారు. 

ఎర్రగుట్టను కబ్జా చేసిన కేతిరెడ్డి విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారని తెలిపారు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే విలాసాలకు అడ్డా అని లోకల్ గా టాక్ వినిపిస్తోందని అన్నారు. 902, 909 సర్వే నెంబర్లలో 20 ఎకరాలను ఆక్రమించారని వివరించారు.

Nara Lokesh
Yuva Galam Padayatra
Kethireddy Venkatrami Reddy
Dharmavaram
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News