Pawan Kalyan: కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్లిన పవన్ కల్యాణ్.. ఎక్కడకు వెళ్లారంటే?
![Pawan Kalyan went to Udaipur for summer vacation](https://imgd.ap7am.com/thumbnail/cr-20230401tn64281bfd8ff76.jpg)
- రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్
- గ్యాప్ దొరకడంతో ఉదయ్ పూర్ కు వెకేషన్ కు వెళ్లిన వైనం
- పవన్ తో పాటు వెళ్లిన భార్య లెజినోవా, కూతురు పోలేనా, కుమారుడు మార్క్ శంకర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక వైపు రాజకీయాలు, మరొకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఆయన సినిమా షెడ్యూల్ కూడా చాలా టైట్ గా ఉంది. తన తాజా చిత్రం 'వినోదయ సిత్తం' రీమేక్ షూటింగ్ పూర్తయింది. మరో వారంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ప్రారంభం కానుంది. 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. దర్శకుడు సుజిత్ పవన్ తో తన సినిమా కోసం లొకేషన్స్ వేటలో ఉన్నాడు.