Nani: పేడ కలపాలని కీర్తికి చెప్పడానికి టెన్షన్ పడ్డాను: 'దసరా' డైరెక్టర్!

Dasara movie team interview

  • గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాగా 'దసరా
  • కీర్తి కళ్లాపి చల్లే సీన్ గురించి ప్రస్తావించిన శ్రీకాంత్ ఓదెల 
  • పేడ కలిపే సీన్ విషయంలో తర్జనభర్జనలు పడ్డామని వ్యాఖ్య 
  • కీర్తి ఒప్పుకుంటుందని అనుకోలేదని వెల్లడి

నాని - కీర్తి సురేశ్ నాయికా నాయకులుగా నటించిన 'దసరా' సినిమా, థియేటర్స్ లో విజయవంతంగా దూసుకుపోతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయమయ్యాడు. తాజాగా నాని - కీర్తి సురేశ్ లతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించాడు.  

"మొదటిసారి కథ విన్నప్పుడు కీర్తి సురేశ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అందువలన ఆమెకి ఏదైనా సీన్ చెప్పేటప్పుడు కొంచెం ఆలోచన చేసేవాడిని. ఈ సినిమాలోని ఒక సీన్ లో కీర్తి  సురేశ్ పేడ కలపాల్సి ఉంది. ఆ విషయం చెబితే ఆమె ఏమంటుందో .. ఒప్పుకుంటుందో .. లేదో అనే ఒక బెరుకు లోపల ఉంది. ఆమె నో చెప్పొచ్చని భావించి ఆర్టు డిపార్టుమెంటు వాళ్లు ఒరిజినల్ పేడతో పాటు 'డమ్మీ' కూడా రెడీ చేశారు. 

"సరే ఒకసారి కీర్తిని అడిగి చూద్దామని ఆమెకి విషయం చెప్పాను. పేడను నీళ్లలో ఇలా కలిపి కళ్లాపి చల్లాలి అని చెప్పాను. ఆమె ఎంత మాత్రం ఆలోచించకుండా ఓకే అనేయడంతో నేను షాక్ అయ్యాను. బాగా అలవాటు ఉన్నదానిలా ఆమె పేడ కలపడం చూసి ఆశ్చర్యపోయాను. ఇక అప్పటి నుంచి కీర్తికి ఏది చెప్పాలన్నా నేను ఆలోచించలేదు" అని చెప్పుకొచ్చాడు.

Nani
Keerthi Suresh
Srikanth Odela
Dasaara Movie
  • Loading...

More Telugu News