Nani: కీర్తి సురేశ్ అదరగొట్టేసింది అంతే!

Keerthi Suresh Special

  • మార్చి 30వ తేదీన విడుదలైన 'దసరా'
  • రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా
  • వెన్నెలగా కీర్తి సురేశ్ నటన హైలైట్
  • 'మహానటి' తరువాత ఆమెకి పడిన మరో మంచి సినిమా ఇది  
  •  ఆమె నటనకి దక్కుతున్న ప్రశంసలు

నిజం చెప్పాలంటే 'మహానటి' తరువాత నటన పరంగా కీర్తి సురేశ్ ను అద్భుతంగా ఆవిష్కరించే పాత్రలేవీ పడలేదు. తెరపై అందంగా మెరిసింది .. అక్కడక్కడా అల్లరి చేసిందిగానీ, వాటితో పాటు బలమైన ఎమోషన్స్ ను పండించే పాత్రలు ఆమెకి పడలేదు. ఆ లోటు తీర్చిన సినిమాగా 'దసరా' గురించి చెప్పుకోవచ్చు. 

ఈ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో కీర్తి సురేశ్ డీ గ్లామర్ రోల్ చేసింది. తెరపై ఆమె పోషించిన 'వెన్నెల' పాత్ర తప్ప ఆమె కనిపించదు. అంగన్ వాడీ స్కూల్ టీచర్ గా ఉంటూ, పిల్లల కోసం కేటాయించిన కోడిగుడ్లు.. కూరగాయలు కొట్టేసేటప్పుడు కీర్తి సురేశ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్. 

అలాగే తనని తాను అద్దంలో చూసుకుని ముద్దాడుతూ, 'ఒరేయ్ సూరిగా పెట్టి పుట్టాలిరా నా కొడకా' అనే డైలాగ్ చెప్పే తీరు కూడా హైలైట్ నే. ఒక పెళ్లి కూతురుగా బ్యాండు మేళం ముందు మ్యూజిక్ లెంగ్త్ లో ఆమె వేసిన మాస్ స్టెప్పులు అదుర్స్. ఇక సూరి దూరమైనప్పుడు.. ధరణి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆమె చూపిన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాలో ఆమె నటనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతుండటం విశేషం.

More Telugu News