Kalyan Ram: 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసిన 'అమిగోస్'

 Kalyan Ram Amigos in OTT Now

  • కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్'
  • ఫిబ్రవరి 10వ తేదీన విడుదలైన సినిమా
  • నిరాశ పరిచిన ఫలితం
  • ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి


కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్' సినిమా, ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా రాజేందర్ రెడ్డి పరిచయమయ్యాడు. ఈ సినిమాతోనే ఆషిక రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించడం ఈ సినిమాలోని ప్రధానమైన అంశం. 

నిజానికి కల్యాణ్ రామ్ ఎంచుకున్న లైన్ కొత్తదే. ఈ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడమే కథలోని ప్రధానమైన అంశం. కథకి ఆషిక గ్లామర్ కూడా బాగానే తోడైంది.


అయితే ఎందుకో ఈ సినిమా మొదటి నుంచి కూడా బజ్ తెచ్చుకోలేకపోయింది. టైటిల్ మైనస్ గా మారిందనే టాక్ కూడా వచ్చింది. 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ' అనే రీమిక్స్ తప్ప మిగతా పాటలు ఆకట్టుకోవు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

More Telugu News