Raviteja: అలాంటివాళ్లను చూస్తే నాకు నవ్వొస్తుంది: రవితేజ

Raviteja Interview

  • 'రావణాసుర'గా ఏప్రిల్ 7న రానున్న రవితేజ
  • ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీ బిజీ 
  • అవమానాలు .. సక్సెస్ లు గుర్తుపెట్టుకోనని వెల్లడి 
  • కష్టపడ్డామని చెప్పుకోవడం కామెడీగా ఉంటుందని వ్యాఖ్య

ఈ మధ్య కాలంలో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టుగా 'రావణాసుర' కనిపిస్తోంది. రవితేజ హీరోగా ఈ సినిమాను సుధీర్ వర్మ రూపొందించాడు. ఈ సినిమా అప్ డేట్స్ చూస్తే, రవితేజ మార్క్ కి భిన్నమైన రూట్లో ఈ సినిమా ఉందనే విషయం అర్థమవుతుంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను రవితేజ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
 
ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడంతో, ప్రమోషన్స్ తో రవితేజ బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ... "గతంలో జరిగిన అవమానాలుగానీ .. ఫెయిల్యూర్ లు గానీ .. సక్సెస్ లు గానీ ఇవేమీ నేను పట్టించుకోను .. గుర్తుపెట్టుకోను. ఆ రోజున నన్ను ఇలా అన్నారు అనేసి ప్రతీకారాలు తీర్చుకునే పనులు పెట్టుకోను" అని అన్నారు. 

"చాలామంది చాలా కష్టాలు పడ్డామని చెప్పుకుంటూ ఉంటారు .. అంతకు మించిన కామెడీ మరొకటి లేదు. ఎవరి కోసం ఎవరు కష్టపడ్డారు? .. ఎదగడం కోసం ఎవరి కష్టాలు వారు పడ్డారు. దానివలన వేరే వాళ్లకి ప్రయోజనం ఏముంటుంది? అందుకే అలా చెప్పుకునేవారిని చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News