Balakrishna: విజయ దశమికి ఆయుధ పూజ.. బాలయ్య సినిమా రిలీజ్ పై అప్ డేట్!

Balayya movie release update by makers

  • బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే 108’ 
  • దసరాకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం
  • శరవేగంగా జరుగుతున్న షూటింగ్.. ఓ షెడ్యూల్ పూర్తి

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్‌బీకే 108’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.

‘విజయదశమికి ఆయుధ పూజ’ అంటూ సినిమా విడుదల ఎప్పుడనేది వినూత్నంగా ప్రకటించింది. ఇక టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పింది. అంతకుముందు ‘సిద్ధం కండి.. ఒస్తున్నం’ అంటూ అప్ డేట్ పై నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ టీజ్ చేసింది.

కొత్త పోస్టర్ తోపాటు రిలీజ్ డేట్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘దుష్ట కోటలను జయించేందుకు నటసింహానికి ఈ విజయదశమి దారి చూపుతుంది’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఎన్ బీకే 108 టైటిల్, విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఆప్ డేట్ తో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

వీర సింహా రెడ్డి సినిమాతో హిట్ అందుకున్న బాలయ్య.. 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. రెండో షెడ్యూల్  నడస్తోంది. ఈ షెడ్యూల్ లో కాజల్, శ్రీలీల బాలయ్యలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ సీన్స్‌ను చిత్రీకరించారు.

More Telugu News