Nani: 'దసరా' ఫస్టు డే వసూళ్లు ఎంతంటే ..!

Dasara Movie Update

  • భారీ అంచనాల మధ్య విడుదలైన 'దసరా'
  • తొలి ఆటతోనే దక్కిన సక్సెస్ టాక్ 
  • 38 కోట్లకి పైగా ఫస్టు డే వసూళ్లు 
  • వీకెండ్ ముగిసే నాటికి 100 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్ 

నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా 'దసరా' సినిమాను రూపొందించాడు. ఇంతవరకూ తాను కనిపించిన దానికి భిన్నంగా .. తనకి గల క్రేజ్ కి భిన్నంగా ఈ సినిమాలో నాని కనిపించాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, దీక్షిత్ శెట్టి కీలకమైన పాత్రను పోషించాడు.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా, నిన్న ఒక్క రోజులోనే 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. నానీ ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో కనిపిస్తాయి. దగ్గర్లో పెద్ద సినిమాలేం లేకపోవడం 'దసరా'కి మరింత కలిసొచ్చే అంశం. వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందేమో చూడాలి. 

More Telugu News