Raviteja: నేనైతే కథ ఏంటనేది చెప్పనబ్బా .. డైరెక్టర్ ను ట్రై చేసుకో: రవితేజ

Raviteja Interview

  • రవితేజ హీరోగా రూపొందిన 'రావణాసుర'
  • కీలకమైన పాత్రను పోషించిన సుశాంత్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
  • రవితేజను ఇంటర్వ్యూ చేసిన హరీశ్ శంకర్  
  • ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా

రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' సినిమా రూపొందింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రవితేజ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో రవితేజ, ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన సుశాంత్ ను కలిపి, దర్శకుడు హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు.

రవితేజ మాట్లాడుతూ .. "డైరెక్టర్ ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా, కథ నచ్చితే సినిమా చేయడానికి నేను వెనుకాడననే మాట వాస్తవమే. అయితే 'స్వామి రారా' సినిమా చూసినప్పుడే సుధీర్ వర్మతో సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇంతకాలానికి మేము ఇద్దరు చేయగలిగే కథ కుదిరింది. అందువల్లనే ఈ సినిమా చేయడం జరిగింది" అన్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పమని హరీశ్ శంకర్ అడిగితే, " ఫన్ .. ఫన్ గా మాట్లాడుకుందామని అన్నావు ... అలాగే మాట్లాడుకుందాము. నేనైతే కథను గురించి ఏమీ చెప్పను. నా పక్కనే ఉన్న సుశాంత్ ను కూడా ఏమీ చెప్పనివ్వను. సుధీర్ వర్మ ద్వారా ట్రై చేస్తానంటే ట్రై చేయి" అంటూ నవ్వేశారు.

Raviteja
Sushanth
Anu Emmanuel
Sudheer Varma
Ravanasura Movie
  • Loading...

More Telugu News