Pawan Kalyan: వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on YSRCP

  • కౌలు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న పవన్
  • ప్రభుత్వ విధానాలే కౌలు రైతుల కడగండ్లకు కారణమని విమర్శ
  • త్వరలోనే రైతుల కష్టాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్న జనసేనాని

వైసీపీ పాలనలో కౌలు రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలే కౌలు రైతుల కడగండ్లకు కారణమని చెప్పారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాక, అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. 

త్వరలోనే జనసేన పార్టీ రైతుల కష్టాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని చెప్పారు. ఈరోజు రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల స్థితిగతులు, వారి కష్టాలపై పవన్ కు నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan
Janasena
Farmers
  • Loading...

More Telugu News