Modi Hatao: మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోస్టర్లు.. ఢిల్లీ నుంచి మొదలుపెట్టిన ఆప్!

AAPs Nationwide Remove PM Save Country Poster Campaign

  • దేశవ్యాప్తంగా 11 భాషల్లో ప్రధానికి వ్యతిరేకంగా ఆప్ పోస్టర్లు
  • ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ పేరుతో ఏర్పాటు
  • ఢిల్లీలో ఇప్పటికే వెలిసిన పోస్టర్లు.. పలువురిపై కేసులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ‘పాన్ ఇండియా’ పోస్టర్ ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించింది. ‘మోదీ హఠావో, దేశ్ బచావో’ అని రాసి ఉన్న పోస్టర్లను దేశవ్యాప్తంగా 11 భాషల్లో ఆప్ ప్రదర్శించింది. ఢిల్లీలో ‘క్యా భారత్ కే పీఎం కో పడే, లిఖే హోనా చాహియే?’ అని రాసి ఉన్న పోస్టర్లు వెలిశాయి.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ అంతటా గోడలు, విద్యుత్ స్తంభాలపై ‘‘మోదీ హఠావో, దేశ్ బచావో’’(మోదీని తొలగించండి, భారతదేశాన్ని రక్షించండి) అని రాసిన పోస్టర్లు కనిపించాయి. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. 49 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. 

ఈ అరెస్టులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ‘‘స్వాతంత్ర్య ఉద్యమంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదు. బ్రిటీష్ పాలనలో భగత్ సింగ్ చాలా పోస్టర్లు అతికించారు. ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు’’ అని చెప్పారు. 

మరోవైపు ఆప్ నకు కౌంటర్ గా బీజేపీ కూడా పోస్టర్ వార్ మొదలుపెట్టింది. ‘కేజ్రీవాల్ హఠావో, ఢిల్లీ బచావో’ అంటూ ప్రచారం ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీలో పోస్టర్లను అతికించింది.

Modi Hatao
Desh Bachao
posters against modi
Narendra Modi
AAP
Arvind Kejriwal
BJP
poster war

More Telugu News