Chandrababu: రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29: చంద్రబాబు

Chandrababu speech in Hyderabad

  • హైదరాబాదులో టీడీపీ 41వ ఆవిర్భావ సభ
  • నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ మీటింగ్ పెట్టారన్న బాబు   
  • అప్పటికప్పుడు పార్టీ పేరును ప్రకటించారని వెల్లడి 
  • చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వుంటుందని వ్యాఖ్య  

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ 41వ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు... రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29 అని వెల్లడించారు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని వివరించారు. 

తెలుగువాళ్ల కోసం ఏంచేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక మీటింగ్ పెడితే, ఆ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయి భారీగా తరలి వచ్చారని, దాంతో ఈ రాష్ట్రం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు అని చంద్రబాబు పేర్కొన్నారు. 

"మనసులోంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రిపేర్ అయి చెప్పలేదు. తెలుగు జాతి నాది.  ఆ తెలుగు దేశం కోసమే పార్టీ పెడుతున్నా... దాని పేరే తెలుగుదేశం అని అప్పటికప్పుడు ప్రకటించారు" అని వివరించారు.

పసుపు రంగు శుభానికి చిహ్నమని, అందుకే నాడు ఎన్టీఆర్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ జెండాలో నాగలి రైతు చిహ్నం, రాట్నం కార్మికుల చిహ్నం, గుడిసె పేదవాడికి చిహ్నం అని వివరించారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగు ప్రజంలదరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.

Chandrababu
TDP
Foundation Day
Hyderabad
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News