Samantha: వైవాహిక బంధంలో నేను వంద శాతం నిజాయతీతో ఉన్నాను... కానీ!: సమంత

Samantha opines on her marital life

  • 'శాకుంతలం' ప్రమోషన్ ఈవెంట్లో సమంత వ్యాఖ్యలు
  • తన నిజాయతీ మంచి ఫలితాలను ఇవ్వలేకపోయిందని వెల్లడి
  • 'ఊ అంటావా' పాటలో చేయొద్దని అందరూ చెప్పారని వివరణ
  • చేయని తప్పుకు ఎందుకు బాధపడాలని భావించి ఆ పాట చేశానని స్పష్టీకరణ

అందాల నటి సమంత ప్రస్తుతం 'శాకుంతలం' చిత్రం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఓ ఈవెంట్ లో తన వ్యక్తిగత అంశాలను వెల్లడించింది. వైవాహిక బంధంలో తాను వంద శాతం నిజాయతీగా ఉన్నానని, కానీ అది మంచి ఫలితాలను ఇవ్వలేదని తెలిపింది. 

వైవాహిక బంధం ముగిసిన కొన్నిరోజులకే 'పుష్ప' చిత్రంలో 'ఊ అంటావా' పాట ఆఫర్ వచ్చిందని వెల్లడించింది. అయితే, విడిపోయిన వెంటనే ఇలాంటి పాటలు చేయడం బాగోదు అని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్పారని సమంత వివరించింది. 

ఎప్పుడూ ప్రోత్సహించే మిత్రులు సైతం ఇదే మాట అన్నారని, కానీ నేనేదో తప్పు చేసిన దానిలా ఎందుకు ఇంట్లో దాక్కోవాలనిపించిందని సమంత పేర్కొంది. చేయని తప్పుకు ఎందుకు బాధపడాలనిపించిందని, అందుకే పుష్ప సాంగ్ కు వెంటనే ఓకే చెప్పేశానని వెల్లడించింది.

Samantha
Marital Life
Actress
Tollywood
  • Loading...

More Telugu News