Tollywood: కృష్ణచైతన్య దర్శకత్వంలో విష్వక్సేన్ కొత్త చిత్రం

krishna chaitanya to direct viswak sen

  • సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ నిర్మాణంలో సినిమా
  • సరికొత్త పాత్రలో కనిపించనున్న విష్వక్
  • దాస్ కా ధమ్కీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యువ హీరో

టాలీవుడ్ యువ హీరో విష్వక్సేన్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. స్వీయ దర్శకత్వంలో ‘దస్ కా ధమ్కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విష్వక్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు (బుధవారం) విష్వక్సేన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటించబోయే తన 11వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ దీనిని సమర్పిస్తోంది.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా గురించి ప్రకటన వీడియో ప్రకారం ఈ చిత్రంలో విష్వక్సేన్ మునుపెన్నడూ లేని మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇచ్చిపడేద్దాం అనే క్యాప్షన్ తో విష్వక్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ఈ ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్ అనేవి ఉండవు. ఉండేది గ్రే మాత్రమే. మాస్ కా దాస్ టర్న్స్ బ్యాడ్ అనే క్యాప్షన్స్ తో సాగే వీడియోకు యువన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.

More Telugu News