TSPSC: హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

TSPSC postpones another exam

  • టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీక్
  • ఇప్పటికే పలు పరీక్షల వాయిదా, కొన్ని రద్దు
  • ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఉద్యోగ నియామకాల పరీక్ష
  • మరో తేదీకి వాయిదా వేసిన అధికారులు

ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజితో సతమతమవుతున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పలు ఉద్యోగ నియామక పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా మరో పరీక్షను కూడా వాయిదా వేసింది. ఏప్రిల్ 4న హార్టికల్చర్ శాఖలో ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ పరీక్షను మరో తేదీన నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. జూన్ 17న హార్టికల్చర్ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. 

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షలు రద్దయ్యాయి. వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షలు మరో తేదీకి వాయిదా పడ్డాయి. ఇప్పుడు హార్టికల్చర్ శాఖ నియామకాల పరీక్ష కూడా వాయిదా పడింది.

TSPSC
Horticulture
Exam
Postpone
Telangana
  • Loading...

More Telugu News