Chandrababu: ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu wrote PM Modi

  • ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం
  • కేంద్రానికి, మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానం
  • ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అన్న చంద్రబాబు 
  • వ్యక్తిగతంగా మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రత్యేక నాణెం విడుదల చేస్తుండడంపై మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ  హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఈ లేఖ రాశారు. 

"ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో హర్షం వ్యక్తం చేసింది. నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి , మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది. 

ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఎన్టీఆర్‌ని సన్మానించడమంటే తెలుగు వారిని గౌరవించడమే. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

Chandrababu
Narendra Modi
Letter
NTR
Coin
Centinery Celebrations
TDP
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News