Jagan: విశాఖ బయల్దేరిన సీఎం జగన్

CM Jagan leaves Vijayawada to attend G20 meeting in Vizag

  • ఇవాళ విశాఖలో జీ20 ప్రతినిధుల సమావేశం
  • గాలా డిన్నర్ ఏర్పాటు చేసిన సర్కారు
  • హాజరు కానున్న సీఎం జగన్

విశాఖలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు జీ20 దేశాల సదస్సు జరగనుంది. జీ20 దేశాలు, యూరప్ కు చెందిన 57 దేశాల ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కావడంతో 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం సీఎం జగన్ విశాఖ బయల్దేరారు. తొలుత జీ20 దేశాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం గాలా డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. జీ20 దేశాల ప్రతినిధుల కోసం ఘనంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందు అనంతరం సీఎం జగన్ తిరిగి తాడేపల్లి పయనమవుతారు.

Jagan
Vizag
G20
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News