Nani: ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లే 'దసరా' పాట!

Dasara movie lyrical song release

  • నాని హీరోగా రూపొందిన 'దసరా' 
  • మాస్ లుక్ తోనే కనిపించనున్న కీర్తి సురేశ్ 
  • సంతోష్ నరాలయం బాణీలకు మంచి మార్కులు 
  • ఈ నెల 30న ఐదు భాషల్లో విడుదలవుతున్న సినిమా

నాని హీరోగా చేసిన 'దసరా' సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. కథా నేపథ్యం .. నానీ - కీర్తి సురేశ్ మాస్ లుక్ .. ఇద్దరి యాస .. ఒక వైపున ప్రేమ .. మరో వైపున ఎమోషన్ .. ఇంకో వైపున యాక్షన్ .. ఇవన్నీ కూడా ఈ సినిమాపై ఆసక్తినీ .. అంచనాలను పెంచుతూ వెళుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నాలుగో లిరికల్ సాంగ్ ను వదిలారు. 'ఓ అమ్మలాలో .. అమ్మలాలో' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో ... హీరోయిన్ బాల్యం, ఆ రోజుల్లో వాళ్లు గడిపిన ఆనందకరమైన క్షణాలు .. అనుభూతులను పంచుకున్న సంఘటనలను కలుపుకుంటూ ఈ పాట నడిచింది. 

ఒకప్పటి బాల్యాన్ని కళ్ల ముందుంచే పాట ఇది. ప్రతి ఒక్కరికీ ఈ పాట కనెక్ట్ అవుతుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి , సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నానికి పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

More Telugu News