Nani: 'దసరా' ఫస్టు డే షూటింగులో నా ఇగో హర్ట్ అయింది: హీరో నాని

Dasara movie team interview

  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా 'దసరా'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్ 
  • షూటింగు ఫస్టు డే దర్శకుడు ఇబ్బంది పెట్టాడన్న నాని

నాని - కీర్తి సురేశ్ జంటగా 'దసరా' సినిమా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో .. మాస్ వాతావరణంలో ఈ కథ నడుస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. ''అది 'దసరా' సినిమా షూటింగు మొదటిరోజు. నాని బాగా చేస్తాడు అని అందరూ అంటూ ఉంటారు .. నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. అందువలన అదే కాన్ఫిడెంట్ తో బయల్దేరాను. ధరణి పాత్రలో అదరగొట్టేసి .. శ్రీకాంత్ ను థ్రిల్ చేయాలని అనుకున్నాను. లొకేషన్ కి వెళ్లి మేకప్ వేయించుకుని రంగంలోకి దిగాను. 

ఎన్నిమార్లు ఎన్ని రకాలుగా చేసి చూపించినా శ్రీకాంత్ ఓకే అనడం లేదు. అసంతృప్తితో తల అడ్డంగా ఆడిస్తున్నాడు. టేకుల మీద టేకులు అవుతున్నాయి. ఓకే చెప్పకపోగా .. 'కావాలంటే బ్రేక్ తీసుకోండి' అన్నాడు. దాంతో నాకు యాక్టింగ్ రాదేమో అనే డౌట్ వచ్చింది. 15 ఏళ్లుగా చేస్తున్నానే అనే ఇగో హర్ట్ అయింది. బ్రేక్ తీసుకున్నప్పుడు .. ధరణి పాత్ర ఎలా నడుచుకుంటుందనే విషయాన్ని శ్రీకాంత్ మరోసారి చెప్పాడు. ఆ తరువాత టేక్ ఓకే అయింది'' అని చెప్పుకొచ్చాడు.

More Telugu News