rashid khan: బౌండరీలకు బ్రేకులేసిన ఆఫ్గన్ బౌలర్.. టీ20ల్లో అరుదైన రికార్డు!

rashid khans record 100 balls without giving a boundary in t20s

  • పాకిస్థాన్ తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న ఆఫ్గన్
  • కెప్టెన్, బౌలర్ గా ‘అద్వితీయ’ పాత్ర పోషించిన రషీద్ ఖాన్
  • టీ20ల్లో ఒక్క బౌండరీ ఇవ్వకుండా వరుసగా 100 బంతులేసిన బౌలర్ గా రికార్డు

క్రికెట్ లో ‘పసి కూన’ అనే పేరును చెరుపుకుంటూ.. సంచలనాలు నమోదుచేస్తోంది ఆఫ్గన్ జట్టు. పాకిస్థాన్ పై ఒక మ్యాచ్ గెలవడమే గొప్ప అనుకుంటే.. ఏకంగా మూడు టీ20ల సిరీస్ ను 2-1తో గెలుచుకుంది. ఈ అద్వితీయ గెలుపులో కెప్టెన్ రషీద్ ఖాన్ ది కీలక పాత్ర. 

బలమైన పాకిస్థాన్ పై సిరీస్ గెలుపుతోపాటు మరో అరుదైన రికార్డును కూడా రషీద్ ఖాన్ సాధించాడు. బౌలర్లను ఊచకోత కోసే టీ20ల్లో.. తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్ మన్ కు బ్రేకులేశాడు. టీ20ల్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా వరుసగా 100 బంతులు వేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు.

టీ20 అంటేనే బ్యాట్స్ మన్ రాజ్యం. ఈ ఫార్మాట్ లో గరిష్ఠంగా ఒక్కో బౌలర్ 4 ఓవర్లు వేయగలడు. అంటే 24 బంతులు. ఆ లెక్కన కనీసం వరుసగా ఐదు మ్యాచ్ లలో రషీద్ ఖాన్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. 

నిన్న పాకిస్థాన్ తో చివరి టీ20లో ఈ ఘనతను నమోదు చేశాడు. 105 బంతుల దాకా ఈ రికార్డు సాగింది. అయితే 106 బంతికి బ్రేక్ అయింది. 106వ బాల్ కు పాక్ బ్యాటర్ ఆయుబ్.. సిక్స్ కొట్టడంతో రికార్డుకు బ్రేక్ పడింది.

More Telugu News