Raviteja: 100 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న రవితేజ 'జింతాక' సాంగ్!

Jinthaak lyrical song record

  • క్రితం ఏడాది డిసెంబర్లో వచ్చిన 'ధమాకా'
  • రవితేజ జోడీగా మెప్పించిన శ్రీలీల 
  • భీమ్స్ సంగీతం ప్రధానమైన ఆకర్షణ 
  •  జనంలోకి దూసుకెళ్లిన 'జింతాక్' సాంగ్

కథ ఏదైనా .. సీన్ ఏదైనా .. పాట ఏదైనా తెరపై టైమ్ వేస్టు చేయని హీరో రవితేజ. ఆయన సినిమా పూర్తి మాస్ కంటెంట్ కి సంబంధించినదే అయితే ఇక ప్రేక్షకులకు పండుగే. అలాంటి ఒక పండుగను 'ధమాకా' సినిమాతో రవితేజ క్రితం ఏడాది డిసెంబర్లో థియేటర్లకు తీసుకుని వచ్చాడు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా శ్రీలీల అలరించింది. భీమ్స్ సంగీతం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలోని పాటల్లో 'జింతాక్' అనే పాట బాగా పాప్యులర్ అయింది. జనంలోకి ఒక రేంజ్ లోకి దూసుకుపోయిన మాస్ పాటగా మార్కులు కొట్టేసింది. 

అలాంటి ఈ పాట 100 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా వదిలారు. కాసర్ల శ్యామ్ సాహిత్యంలో మంచి ఛమక్కులు వినిపిస్తాయి. అలాగే భీమ్స్ ఇచ్చిన బీట్ కూడా ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్ ... కలర్ఫుల్ సెట్ .. కొరియోగ్రఫీ ఇలా అన్నీ కుదిరిన పాట ఇది. అందుకే ఈ రేంజ్ లో ఈ పాట దూసుకుపోతోందని చెప్పచ్చు.

More Telugu News