Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు

Vivek Agnihotri sensational comments on Rahul Gandhi

  • రాహుల్ పై అనర్హత వేటు పడటంపై వివేక్ సంచలన ట్వీట్
  • రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడన్న వివేక్
  • ఇప్పుడు అనర్హత అధికారికం అయిందని వ్యాఖ్య

వివేక్ అగ్నిహోత్రి... 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు. ఇప్పుడు 'ది వ్యాక్సిన్ వార్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉండే వివేక్... దేశంలో చోటుచేసుకునే పలు అంశాలపై తన స్పందనను తెలియజేస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఎంపీ పదవిపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 

దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ... రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడని అన్నారు. ఇప్పుడు అనర్హత అధికారికం అయిందని ట్వీట్ చేశారు. గతంలో ఇందిరాగాంధీపై అనర్హత వేటు పడినప్పుడు కూడా కాంగ్రెస్ వాదులు విమర్శలు గుప్పించారని... అయితే, ఆమె నిజమైన నాయకురాలు కావడంతో తిరిగి పుంజుకున్నారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేకపోవడంతో... ఆ పార్టీ ఏం చేస్తుందో వేచిచూడాలని అన్నారు.

Vivek Agnihotri
Bollywood
Rahul Gandhi
Congress
Disqualification
  • Loading...

More Telugu News