Manchu Manoj: మంచు విష్ణుతో వివాదంపై మనోజ్ స్పందన

Manoj opines on rift with his brother

  • ఇటీవల మంచు విష్ణు వీడియో పంచుకున్న మనోజ్
  • ఇళ్లలోకి వచ్చి ఇలా కొడుతుంటారు అంటూ వ్యాఖ్యలు
  • ఆ వీడియో గురించి తనకంటే ఓ చానల్ కు ఎక్కువగా తెలుసని వ్యంగ్యం

ఇటీవల తన సోదరుడు మంచు విష్ణు బంధువుల ఇళ్లపై ఇలా దాడులు చేస్తుంటాడు అని మంచు మనోజ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలిసిందే. దాంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కాయి. మనోజ్ రిలీజ్ చేసిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై మనోజ్ స్పందిస్తూ, ఓ మీడియా చానల్ పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 

వీడియో గురించి తనకంటే ఆ చానల్ కే మరింత తెలుసని, వాళ్లను అడిగితే చాలా విషయాలు చెబుతారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక ఈ వీడియో గురించి నన్ను అడగొద్దు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇటీవల మంచు విష్ణు వాగ్వాదం జరుపుతున్న వీడియోను పంచుకున్న మనోజ్... కొద్దిసేపటికే దాన్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు.

Manchu Manoj
Manchu Lakshmi
Video
Mohan Babu
Tollywood
  • Loading...

More Telugu News