Kiran Abbavaram: ఒక్క మాటలో చెప్పాలంటే 'మీటర్' లైన్ ఇదే: కిరణ్ అబ్బవరం

Meter Team Interview

  • కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన 'మీటర్'
  • కథానాయికగా అతుల్య రవి పరిచయం 
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల
  • ఇది పక్కా మాస్ యాక్షన్  మూవీ అని చెప్పిన కిరణ్

కిరణ్ అబ్బవరం హీరోగా క్లాప్ బ్యానర్ పై నిర్మితమైన 'మీటర్' సినిమాకి రమేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో కథానాయికగా అతుల్య రవి పరిచయమవుతోంది. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో కిరణ్ .. అతుల్య రవి .. సప్తగిరి పాల్గొన్నారు. 

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "ఇది పక్కా మాస్ ఎంటర్టయినర్ .. నాకు చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలంటే చాలా ఇష్టం. అందువలన అలాంటి సినిమాలు పడినప్పుడు నేను ఇష్టంతో చేయడం వలన ఈజీగా చేసినట్టుగా ఆడియన్స్ కి అనిపిస్తూ ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది ... సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది" అన్నాడు. 

"ఈ సినిమా కథ పరిధి పెద్దది .. అందుకోసం చేసిన ఖర్చు కూడా ఎక్కువే. అందువలన ఇది చిన్న సినిమా కానే కాదు. హీరో ప్రతి విషయాన్ని మీటర్ తో ముడిపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. 'నా మీటర్లో నేను వెళతాను .. నన్నెవ్వడూ ఆపలేడు' అన్నట్టుగా ఉంటుంది. అందువల్లనే ఈ టైటిల్ ను సెట్ చేయడం జరిగింది" అని చెప్పాడు.

హీరో పోలీస్ ఆఫీసర్ కావాలనేది అతని తండ్రి డ్రీమ్. ఆ విషయంలో హీరో తండ్రికి ప్రామిస్ చేస్తాడు. కానీ అతనికి పోలీస్ జాబ్ ఇష్టం ఉండదు. అందువలన అతను ఏం చేశాడనేది పూర్తి ఎంటర్టయిన్మెంట్ తో నడుస్తుంది. హీరోయిన్ రోల్ కూడా అందుకు తగినట్టుగానే ఉంటుంది. అతుల్య రవి చాలా బాగా చేసింది" అంటూ చెప్పుకొచ్చాడు. 

Kiran Abbavaram
Athulya Ravi
Saapthagiri
Meter Movie
  • Loading...

More Telugu News