Kollywood: మరో తెలుగు దర్శకుడితో శివ కార్తికేయన్ సినిమా

 Siva Karthikeyan ties up with Another Telugu director

  • కేవీ అనుదీప్ తో 'ప్రిన్స్' సినిమా చేసిన తమిళ హీరో
  • రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణతో పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్
  • యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న చిత్రం

ఇది వరకు తమిళ దర్శకులతో పని చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపెట్టారు. ఎస్జే సూర్య, మురుగదాస్ తదితరులు తెలుగులో నేరుగా సినిమాలు చేశారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. తమిళ హీరోలే తెలుగు డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. అందులో శివ కార్తికేయన్ ఒకరు. డాక్టర్, డాన్‌ లాంటి చిత్రాలతో ఆయన టాలీవుడ్‌కి దగ్గరయ్యారు. తెలుగు దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైరెక్షన్‌లో ‘ప్రిన్స్’ చిత్రం చేశారు. 

తెలుగులో ఓ మోస్తరుగానే ఆడిన ఈ సినిమాకు తమిళ్ లో మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు శివ కార్తికేయన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. గోపీచంద్ తో జిల్, ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రాలను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. రాధాకృష్ణ చెప్పిన కథ కార్తికేయన్‌కు నచ్చడంతో పచ్చజెండా ఊపాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి రాధాకృష్ణతో సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Kollywood
Tollywood
Siva Karthikeyan
Telugu director
radhakrishna kumar
  • Loading...

More Telugu News