Adithya Om: కులాల అడ్డుగోడల మధ్య సాగే ప్రేమకథగా 'దహనం' .. ట్రైలర్ రిలీజ్!

Dahanam trailer released

  • చాలా కాలం క్రితమే హీరోగా పరిచయమైన ఆదిత్య ఓమ్ 
  • వరుస పరాజయాలతో తగ్గిన అవకాశాలు 
  • 'దహనం'తో రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు
  •  గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది  

తెలుగు తెరకి 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో ఆదిత్య ఓమ్ పరిచయమయ్యాడు. తెరపై చాలా యాక్టివ్ .. ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లినప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో సహజంగానే ఆయన వెనుకబడిపోయాడు.

చాలా గ్యాప్ తరువాత ఆయన రీ ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆయన చేస్తున్న సినిమాల జాబితాలో నుంచి ముందుగా ప్రేక్షకులను పలకరించడానికి 'దహనం' రెడీ అవుతోంది. మూర్తిసాయి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కులాల మధ్య ఇమడలేని ప్రేమకథగా కనిపిస్తోంది. 

ఒక కాటికాపరి కొడుకును ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ ప్రేమ వ్యవహారం ఆ ఊరి పెద్దకి తెలుస్తుంది. అగ్రకులస్థులను ఊరి వదిలి వెళ్లిపొమ్మని గ్రామ పెద్ద తీర్పు చెబుతాడు. ఆ తరువాత జరిగేదేమిటి? అనేదే కథ. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News