Priyadrshi: ఇతను వద్దు అంటూ దిల్ రాజు నా ఫొటోను పక్కన పెట్టేశారట: 'బలగం' నారాయణ

Balagam Muralidhar Interview

  • 'బలగం' సినిమాలో నారాయణ పాత్ర ప్రత్యేకం 
  •  హీరోయిన్ కి తండ్రిగా మెప్పించిన మురళీధర్ 
  •  కొద్దిలో ఆ ఛాన్స్ పోయేదేనని వ్యాఖ్య   
  • వేణు రిక్వెస్ట్ చేయడం వలన ఓకే అయిందని వెల్లడి  

ఇటీవల వచ్చిన 'బలగం' సినిమా చాలా తక్కువ రోజులలో దిల్ రాజుకు లాభాలు తెచ్చిపెట్టింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసినవారికి ప్రతి పాత్ర బాగా గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలలో 'నారాయణ' పాత్ర ఒకటి. హీరోకి మేనమామగా .. హీరోయిన్ కి తండ్రిగా ఈ పాత్ర కనిపిస్తుంది. గతంలో తనకి మర్యాద జరగలేదన్న కారణంతో, హీరో ఫ్యామిలీపై అలిగే పాత్ర ఇది. 

ఈ పాత్రను పోషించిన నటుడి పేరు మురళీధర్. గ్రామీణ నేపథ్యంలో ఒక అల్లుడి అలక ఎలా ఉంటుందనే దానికి నారాయణ పాత్ర ఒక నిదర్శనం. ఈ పాత్రలో కాస్త నిర్లక్ష్యంగా కనిపించే నారాయణ బాడీ లాంగ్వేజ్ ను చూసి తీరవలసిందే. ఈ మధ్య కాలంలో సహజమైన నటనను కనబరిచిన అతి తక్కువ మందిలో మురళీధర్ ఒకరని చెప్పుకోవచ్చు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు. 

"ఈ సినిమా కోసం వేణు ఆర్టిస్టులందరినీ ఎంపిక చేసి, ఆ ఫొటోలను దిల్ రాజు ముందు పెట్టాడట. ఏ పాత్ర కోసం ఎవరిని అనుకున్నది చెప్పాడు. కానీ దిల్ రాజుగారు కొంతమంది ఫొటోలను పక్కన పెట్టేసి, వారికి బదులుగా వేరే వారిని తీసుకోమని చెప్పారట. నారాయణ పాత్రకిగాను ఆయన మరో ఆర్టిస్ట్ పేరు కూడా చెప్పారు. కానీ నారాయణ పాత్రకి నేను కరెక్ట్ అని వేణు చెబితే అప్పుడు దిల్ రాజు గారు ఓకే అన్నారట. లేదంటే చేతివరకూ వచ్చిన వేషం పోయేదే" అని చెప్పుకొచ్చాడు. 

Priyadrshi
Kavya
venu
Dil Raju
Muralidhar
Balagam Movie
  • Loading...

More Telugu News