Tejashwi Yadav: తండ్రి అయిన తేజస్వి యాదవ్

Tejashwi Yadav Welcomes First Child

  • ఈ తెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చిన తేజస్వి భార్య
  • భగవంతుడు గొప్ప గిఫ్ట్ ను పంపించాడన్న తేజస్వి 
  • ప్రేమ వివాహం చేసుకున్న తేజస్వి 

ఆర్జేడీ అగ్రనేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య రాచెల్ గోడిన్హో పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని తేజస్వి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తమకు కూతురు రూపంలో భగవంతుడు గొప్ప గిఫ్ట్ ను పంపించాడని తేజస్వి అన్నారు. ఈ తెల్లవారుజామున రాచెల్ కు డెలివరీ అయింది. తేజస్వి వివాహం 2021 డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఢిల్లీలోని ఆర్కే పురంలోని డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి తన స్నేహితురాలిని తేజస్వి పెళ్లి చేసుకున్నారు. తండ్రి అయిన తేజస్వికి అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Tejashwi Yadav
Father
Bihar

More Telugu News