TTD: ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

TTD releases SED tickets today

  • శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు
  • ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల
  • ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ
  • నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు
  • టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. 

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.

TTD
SED
Tickets
Online
Tirumala
  • Loading...

More Telugu News