eye health: కళ్లకు హాని చేసే పదార్థాలు ఇవి..

 foods that have negative impact on eye health
  • ట్రాన్స్ ఫ్యాట్, చక్కెరలతో మధుమేహం ముప్పు
  • దీనివల్ల కంటి చూపుపై ప్రభావం
  • ఉప్పు, ఆల్కహాల్ అధికంగా తీసుకున్నా రిస్క్
కళ్లకు హాని చేసేవి కూడా ఉంటాయా..? అని ఆశ్చర్యం కలగొచ్చు. కంటి ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నట్టే.. కంటి చూపును దెబ్బతీసేవి కూడా ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ వీటి విషయంలో శ్రద్ధ తీసుకోవడం ఎంతైనా అవసరం.

ట్రాన్స్ ఫ్యాట్స్
వేయించిన వేపుళ్లు, బేక్డ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి. వీటిని ఎక్కువ తినడం వల్ల వయసు ఆధారిత మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ) సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితితో కంటి చూపు తగ్గిపోతుంది.

ఉప్పు
ఉప్పు కంటికి కూడా హాని చేస్తుంది. ఉప్పు ఎక్కువైతే అది రక్తపోటు, గుండె, మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని వినే ఉంటారు. నిజానికి అధిక రక్తపోటు కంటి చూపును దెబ్బతీస్తుంది. జీవితాంతం ఔషధాలు వాడాల్సిన గ్లకోమా వ్యాధికీ దారితీస్తుంది.

పండ్లు
పండ్లు కూరగాయలను తీసుకోకపోవడం కూడా కంటి చూపు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఎందుకంటే పండ్ల ద్వారా మనకు కావాల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సీ, ఈ, ఏ ఎక్కువగా లభించే పండ్లు తినాలి.

ఆల్కహాల్ వినియోగం
తక్కువ పరిమాణంలో మద్యం తీసుకునేవారు చాలా కొద్ది మందే ఉంటారు. కొంత తాగిన తర్వాత, మరికొంత చొప్పున తీసుకునే వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు.  మరి మద్యం అధికంగా తీసుకోవడం వల్ల అధిక పోషకాల లోపానికి, ముఖ్యంగా విటమన్ ఏ లోపానికి దారితీస్తుంది. 

తీపి పదార్థాలు
అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఆహారాలు మంచివి కావు. టైప్2 మధుమేహం బారిన పడతారు. డయాబెటిక్ రెటీనోపతికి కారణమవుతుంది. దీనివల్ల కంటి చూపు తగ్గిపోతుంది.

కెఫైన్
కాఫీలు తెగతాగే వారు ఒకసారి తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే కెఫైన్ కంటిపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా గ్లూకోమా వ్యాధికి దారితీయవచ్చు.
eye health
eye sight
negative
processed fods

More Telugu News