Abdullah: హైదరాబాద్ జూలో చివరి చీతా గుండెపోటుతో మృతి

Last Cheetah in Hyderabad Zoo died

  • అబ్దుల్లా అనే చీతా మరణం
  • పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు
  • గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారణ

హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో అబ్దుల్లా అనే చీతా మృతి చెందింది. పోస్టుమార్టంలో ఈ చీతా గుండెపోటుతో మరణించినట్టు నిర్ధారణ అయింది. అబ్దుల్లా మగ చీతా. దీని వయసు 15 సంవత్సరాలు. హైదరాబాదు జూలో ఇదే చివరి చీతా. ఇప్పుడు దీని మరణంతో జూలో చీతాలే లేకుండా పోయాయి. 

అబ్దుల్లా సౌదీ అరేబియాకు చెందిన చీతా. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు హైదరాబాదు జూని సందర్శించారు. ఆ తర్వాత రెండు చీతాలను ఈ జూకి అందించారు. వాటిలో ఒకటి ఆడ చీతా కాగా, దాని పేరు హీబా. అది 12 ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పుడు దాని జత అబ్దుల్లా కూడా మృతి చెందింది. 

ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో మైసూర్ తో పాటు హైదరాబాద్ జూలోనే చీతాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం మైసూరులోని చీతాలే మిగిలాయి.

Abdullah
Cheetah
Death
Heart Attack
Hyderabd Zoo
Soudi Arabia
  • Loading...

More Telugu News