Keeravani: ఆస్కార్ కాదు కదా.. నాటు నాటు పాటకు ఏ అవార్డు వస్తుందని అనుకోలేదు: కీరవాణి

Keeravani opines in Oscar award for Naatu Naatu song

  • నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు
  • నాటు నాటు ఒక కమర్షియల్ సాంగ్ అన్న కీరవాణి
  • బీట్ ప్రధానంగా సాగే పాట అని వివరణ
  • రాజమౌళి టేకింగ్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ హైలైట్ అని కితాబు

బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం తెలిసిందే. ఇది పక్కా మాస్ సాంగ్. సాహిత్య విలువల పరంగానూ అత్యున్నతస్థాయిలో ఉందని చెప్పలేం! బీట్, రిథమ్ ప్రధానంగా సాగే ఈ పాట ఆస్కార్ బరిలో మిగతా పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో విజేతగా నిలిచింది. 

దాంతో చిత్రబృందాన్ని అభినందించేవారు కొందరైతే, ఈ పాటకు నిజంగా ఆస్కార్ స్థాయి ఉందా అంటూ మరికొందరు చర్చను లేవనెత్తారు. ఈ అంశంపై నాటు నాటు పాట సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఈ పాటకు ఆస్కార్ కాదు కదా... అసలు ఏ అవార్డు వస్తుందని నేను ఊహించలేదు అని స్పందించారు. నాటు నాటు ఒక కమర్షియల్ సాంగ్ అని తెలిపారు. 

"ఆర్కెస్ట్రయిజేషన్ లో కొత్తదనం, క్లాసికల్ మ్యూజిక్ పరంగా ప్రతిభను కనబర్చడం, అద్భుతం అనదగ్గ సాహిత్యం ఉంటే ఆ పాటకు ఏదైనా అవార్డు వస్తుందని ఆశిస్తాం. కానీ నాటు నాటు పాట పక్కా ఫాస్ట్ బీట్ సాంగ్. ఈ పాటకు అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. 

నాటు నాటు పాటను తెలుగులోనే కాదు తమిళం, హిందీ, మలయాళం వెర్షన్లలోనూ చేశాం. అక్కడి లిరిక్ రైటర్లు కూడా బాగానే రాశారు. కానీ తెలుగులో నాటు నాటు వీర నాటు.... నాటు నాటు ఊర నాటు వాక్యాలు మంత్రం లాంటివి. ఆ వాక్యాల సృష్టికర్త చంద్రబోస్ ఆస్కార్ పురస్కారానికి అర్హుడే అని భావిస్తాను. అయితే, రాజమౌళి చిత్రీకరించిన విధానం, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రధాన క్రెడిట్ వారిద్దరికే ఇవ్వాలి" అని కీరవాణి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News