Pan-Aadhar linking: ఎస్ఎమ్‌ఎస్‌తో పాన్, ఆధార్ లింకింగ్.. ఎలాగో తెలుసా?

How To Link PAN and Aadhaar Through SMS How To Check Status

  • ఆధార్ పాన్ అనుసంధానానికి దగ్గరపడుతున్న చివరి తేదీ
  • మరో వారం రోజులే గడువు
  • ఎస్ఎమ్ఎస్ ద్వారా సులభంగా ఆధార్ పాన్ లింకింగ్

పాన్-ఆధార్ కార్డు అనుసంధానానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. మరో వారం రోజులే మిగిలుంది. అప్పటిలోగా ఈ రెండు డాక్యుమెంట్లను అనుసంధానం చేయని పక్షంలో పాన్ నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. అయితే.. ఎస్‌ఎమ్ఎస్ ద్వారా ఈ రెండింటినీ సులభంగా లింక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎస్ఎమ్ఎస్ ద్వారా పాన్, ఆధార్ ఎలా లింక్ చేయాలంటే.. 
  • ''UIDPAN<12 అంకెల ఆధార్ నెంబర్><పది అంకెల పాన్ నెంబర్>’’ అని టైప్ చేయాలి
  • పైన పేర్కొన్న సందేశాన్ని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 56161 లేదా 567678 నెంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలి. 

ఇన్‌కం ట్యాక్స్ వెబ్‌సైట్ ద్వారా.. 
  • https://www.incometax.gov.in/iec/foportal/ ద్వారా కూడా పాన్, ఆధార్‌లను లింక్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని ఈ-ఫైలింగ్ పోర్టర్ లో ఇందుకు సంబంధించిన సదుపాయం ఉంది. 
  • ఈ ఫైలింగ్ పోర్టల్‌లోని ‘లింక్ ఆధార్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 
  • ఆ తరువాత స్క్రీన్‌పై కనిపించిన పేజీలో ఆధార్, పాన్ నెంబర్‌లు, ఇతర వివరాలను చేర్చి ఎంటర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డాక్యుమెంట్ల అనుసంధానం పూర్తయిపోతుంది.
పాన్‌, ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇలా చెక్ చేయండి..
  • www.incometax.gov.in/iec/foportal/ వెబ్‌సైట్‌లో పాన్ ఆధార్ లింక్ అయ్యిందీ లేనిదీ తెలుసుకోవచ్చు.
  • ఇందుకోసం వెబ్‌సైట్‌లోని ఈ ఫైలింగ్ పేజ్‌లో ‘క్విక్ లింక్స్’ విభాగంలోని ‘లింక్ ఆధార్’ స్టేటస్ అన్న లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • ఆ తరువాత స్క్రీన్‌పై ఆధార్, పాన్ నెంబర్లను ఎంటర్ చేసి ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేస్తే లింకేజ్ అయ్యిందీ లేనిదీ తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News