Virat Kohli: సామాజిక సేవల కోసం స్వచ్ఛంద సంస్థను స్థాపించిన కోహ్లీ, అనుష్క శర్మ

Kohli and Anushka established SEVVA

  • ఇప్పటికే విరాట్ కోహ్లీ, అనుష్క పేరిట ఫౌండేషన్లు
  • రెండింటినీ విలీనం చేసిన వైనం
  • కొత్తగా సేవ పేరిట ఎన్జీవోకు శ్రీకారం
  • తమకు సాధ్యమైన రీతిలో సేవలు చేస్తూనే ఉంటామన్న కోహ్లీ, అనుష్క

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, ఆయన అర్ధాంగి అనుష్క శర్మ సామాజిక సేవల కోసం ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పేరు సేవ (ఎస్ఈవీవీఏ). ఇందులో ఎస్ఈ అంటే (సెల్ఫ్) స్వీయ, వీ అంటే విరాట్, వీ అంటే వామిక, ఏ అంటే అనుష్క. వామిక.... కోహ్లీ, అనుష్క దంపతుల ముద్దుల తనయ అని తెలిసిందే. తమ పేర్లు కలిసొచ్చేలా కోహ్లీ దంపతులు తమ ఎన్జీవోకు నామకరణం చేశారు. 

కాగా, కోహ్లీ, అనుష్క ఇప్పటికే విడివిడిగా సామాజిక సేవలు చేస్తున్నారు. అందుకోసం వారు తమ పేరిట విరాట్ కోహ్లీ ఫౌండేషన్, అనుష్క శర్మ ఫౌండేషన్ స్థాపించారు. ఇప్పుడు నూతన ఎన్జీవో సేవ ఆవిర్భావం నేపథ్యంలో రెండు ఫౌండేషన్లను విలీనం చేశారు. ప్రపంచం ఓ కుటుంబం వంటిదని, ఆ కుటుంబంలోనే తాము కూడా జీవిస్తున్నామని కోహ్లీ, అనుష్క తెలిపారు. ప్రపంచమనే కుటుంబానికి తమకు వీలైనంతగా సేవ చేస్తూనే ఉంటామని వివరించారు.

Virat Kohli
Anushka Sharma
SEVVA
NGO
Team India
Bollywood
  • Loading...

More Telugu News