Prakash Raj: పెళ్లి తరువాత రమ్యకృష్ణతో చేసిన సినిమా ఇది .. కాస్త భయపడ్డాను: కృష్ణవంశీ

Krishna vamsi Interview

  • కృష్ణవంశీ రూపొందించిన 'రంగమార్తాండ'
  • నిన్ననే థియేటర్లకు వచ్చిన సినిమా 
  • తొలి ఆటతోనే దక్కిన మంచి రెస్పాన్స్
  • రమ్యకృష్ణ గొప్ప నటి అంటూ కృష్ణవంశీ కితాబు  

కృష్ణవంశీ తాజా చిత్రంగా రూపొందిన 'రంగమార్తాండ' నిన్ననే థియేటర్లకు వచ్చింది. నిన్న చాలా చోట్లా ఈ సినిమా హౌస్ ఫుల్స్ పడ్డాయి. తొలి ఆటతోనే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తరువాత థియేటర్స్ లో కన్నీళ్లు పెట్టించిన సినిమా ఇది. ఈ సినిమాను గురించి తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడారు. 

"ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ భార్య పాత్ర కోసం .. రేవతి .. రాధిక .. సుహాసిని .. శోభన .. టబూ వీళ్లంతా కూడా కళ్లముందు మెదిలారు. వాళ్లని సంప్రాదించే పనుల్లో నేను ఉండటం చూసిన రమ్యకృష్ణ, 'నేను చేయనా' అని అడిగింది. ఈ పాత్రకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు .. కళ్లతోనే మాట్లాడవలసి ఉంటుంది.. ఆలోచించుకో" అని చెప్పాను.

' మరేం ఫరవాలేదు .. నేను చేస్తాను' అంది. దాంతో నేను భయపడిపోయాను. ఎందుకంటే పెళ్లికి ముందు రమ్యతో 'చంద్రలేఖ' చేశాను. ఆ తరువాత ఇద్దరం కలిసి ఇంతవరకూ సినిమా చేయలేదు. ఇప్పుడు ఆమెకి ఉన్న క్రేజ్ వేరు. తను మంచి నటి అనే విషయం ఇంతకుముందు తెలుసు .. ఈ సినిమాతో తాను గొప్ప నటి అనే సంగతి అర్థమైంది" అంటూ చెప్పుకొచ్చారు. 

Prakash Raj
Ramya Krishna
Krishna vamsi
Rangamaarthanda movie
  • Loading...

More Telugu News